Sharmila: 140 సీట్లు ఖాయం... జగన్ సీఎం అవుతాడు చూడండి: ఓటేసిన తరువాత షర్మిల

  • దేవుడిపై నాకు నమ్మకం ఉంది
  • నేడు ఓటింగ్ లో యువతే కీలకం
  • వైఎస్ జగన్ సోదరి షర్మిల

ఈ ఉదయం ఓటేసిన వైఎస్ జగన్ సోదరి షర్మిల, దేవుడి దయతో జగన్ సీఎం కానున్నారని వ్యాఖ్యానించారు. మళ్లీ రాజన్న రాజ్యం రాబోతోందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 140 సీట్లు రానున్నాయని తాను అనుకుంటున్నానని అన్నారు. తాను ఎక్కువ చెప్పడం సబబుకాదని, తనకు దేవుడిపై నమ్మకం ఉందని అన్నారు. ప్రతి జిల్లాలోనూ జగన్ యువభేరి సభలను నిర్వహించారని, వాటితో యువతలో ఎంతో చైతన్యం వచ్చిందని అన్నారు. యువత నేడు తీర్పును ఇవ్వబోతున్నారని షర్మిల తెలిపారు.

ప్రజలంతా జగన్ ప్రత్యేక హోదా కోసం ఎంతగా పోరాడారో చూశారని, ఇంకోపక్క చంద్రబాబు బీజేపీతో కలిసి, చేతులారా రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారో చూశారని అన్నారు. ప్రజలు అలసిపోయివున్నారని, మార్పును కోరుకుంటున్నారని అన్నారు. ఇంతకన్నా తాను ఇంకేమీ మాట్లాడకూడదని అంటూ వెళ్లిపోయారు.

Sharmila
Jagan
Vote
  • Loading...

More Telugu News