Andhra Pradesh: సోషల్ మీడియాలో చంద్రబాబు మార్ఫింగ్ వీడియో హల్‌చల్.. జైళ్ల శాఖ మాజీ అధికారిపై ఫిర్యాదు చేసిన టీడీపీ

  • ‘రిటైర్డ్‌ ప్రిజన్స్‌ ఆఫీసర్స్‌ గ్రూప్‌’లో పోస్టు అయిన వీడియో
  • పోస్టు చేసిన జైళ్ల శాఖ మాజీ అధికారి ఎన్.రాజు
  • చర్యలు తీసుకోవాలన్న టీడీపీ

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చంద్రబాబు స్వరాన్ని మార్ఫింగ్ చేసిన ఈ వీడియోను జైళ్ల శాఖ మాజీ అధికారి ఎన్.రాజు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. ‘రిటైర్డ్‌ ప్రిజన్స్‌ ఆఫీసర్స్‌ గ్రూప్‌’లో పోస్టు చేసిన ఈ వీడియోలో చంద్రబాబు గొంతును మార్ఫింగ్ చేశారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్న ఆయన జైళ్ల శాఖ మాజీ అధికారి ఎన్.రాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
GK dwivedi
varla ramaiah
Chandrababu
video morphing
  • Loading...

More Telugu News