Telangana: ఓటుకు వేళాయే.. చింతమడకలో కేసీఆర్.. బంజారాహిల్స్‌లో కేటీఆర్!

  • హెలికాప్టర్‌లో చింతమడక చేరుకోనున్న కేసీఆర్ దంపతులు
  • రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక స్వగ్రామానికి రావడం ఇదే తొలిసారి
  • సోమాజీగూడలో ఓటేయనున్న గవర్నర్

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి మరికాసేపట్లో హెలికాప్టర్‌లో చింతమడక చేరుకోనున్న కేసీఆర్ దంపతులు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక సొంతూరికి రానుండడం ఇదే తొలిసారి.

ఇక కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాలులో ఓటుహక్కు వినియోగించుకుంటారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఉదయం 9 గంటలకు సోమాజీగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు.

Telangana
KCR
KTR
Governor
vote
election
  • Loading...

More Telugu News