Train: ఏపీ ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లను వేస్తున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ

  • సాయంత్రం 6:20కి కాకినాడకు ప్రత్యేక రైలు
  • రాత్రి 7:20కి తిరుపతికి ప్రత్యేక రైలు
  • రాత్రి 9 గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడ

రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాదులోని ఓటర్లంతా తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బస్సులన్నీ కొద్ది రోజుల క్రితమే ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. అయితే నేడు సడెన్‌గా కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు తమ బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.  

ఇక ఇటు రైళ్లలో కూడా నిలబడేందుకు సైతం చోటు దొరక్కపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి ఏపీకి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను వేసినట్టు ప్రకటించింది. నేటి సాయంత్రం 6:20కి సికింద్రాబాద్ నుంచి కాకినాడకు, రాత్రి 7:20కి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును వేసినట్టు రైల్వేశాఖ తెలిపింది. రాత్రి 9 గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడకు కూడా ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు వెల్లడించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News