Police: టేకాఫ్ కు సిద్ధమవుతున్న విమానం నుంచి రూ.7.8 కోట్ల దోపిడీ

  • అల్బేనియాలో ఘటన
  • దుండగుల వద్ద ఏకే-47 తుపాకులు
  • ఒకరిని కాల్చిచంపిన పోలీసులు

అల్బేనియాలో కొందరు సాయుధ దుండగులు గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానం నుంచి రూ.7.8 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. అల్బేనియా రాజధాని టిరానాకు సమీపంలోని మదర్ థెరెస్సా రినాసీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ఆస్ట్రియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అన్ని క్లియరెన్సులు పూర్తిచేసుకుని టేకాఫ్ కు సిద్ధమైన తరుణంలో కొందరు సాయుధులు ఏకే-47 తుపాకులతో విమానంలోకి ప్రవేశించి నగదు దోపిడీ చేశారు. అనంతరం పారిపోతుండగా, విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఓ దోపిడీదారుడ్ని పోలీసులు కాల్చి చంపారు. మిగతావారు నగదుతో పరారయ్యారు.

విమానంలో దోపిడీ జరిగిందన్న సమాచారంతో దాదాపు 500 మంది పోలీసులు రంగంలోకి దిగారు. వారికి ఓ హెలికాప్టర్ కూడా సాయం అందించింది. దుండగులు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ స్టిక్కర్ లో ఉన్న కారును ఈ దోపిడీ కోసం ఉపయోగించారు. దొంగిలించిన సొమ్ము ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందినదిగా భావిస్తున్నారు. అయితే, తాము ప్రయాణించిన కారును ఓ ప్రాంతంలో తగులబెట్టిన దుండగులు మరో వాహనంలో ఉడాయించారు.

  • Loading...

More Telugu News