Konda visweswar Reddy: నాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఈసీకి కొండా విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-99e86f9379352ce21c2f32817478090defe33b52.jpg)
- కింది స్థాయి క్యాడర్‌ను కొన్నారు
- రూ.10 లక్షలు దొరికాయని ప్రచారం
- గెలుస్తాననే భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు
తనకు సంబంధించిన వ్యక్తి దగ్గర రూ.10 లక్షలు దొరికాయంటూ తనపై బురదజల్లుతున్నారని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఆయన తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గ పరిధిలోని కింది స్థాయి క్యాడర్‌ను కొనేశారని ఆరోపించారు. తాను భారీ మెజారిటీతో గెలుస్తాననే భయంతోనే ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు.