Telugudesam: లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఈసీ అభ్యంతరం
- ఎన్నికల వేళ ప్రభావం చూపుతుంది
- ఉద్యమ సింహం, పీఎం మోదీ బయోపిక్ లపైనా అదే నిర్ణయం
- ఈ మూడు సినిమాలపై గతంలోనూ ఫిర్యాదులు
ఎన్నికల వేళ ప్రజలను ప్రభావితం చేస్తాయంటూ ఇటీవల కొన్ని రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలపై ఫిర్యాదులు రావడం తెలిసిందే. ఇలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఈ చిత్రం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపైనే కాకుండా కేసీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఉద్యమసింహం', ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథతో రూపొందిన 'పీఎం మోదీ' చిత్రాల విడుదలకు కూడా ఈసీ నో చెప్పింది. ఈ మూడు సినిమాలను ఎన్నికల సమయంలో రిలీజ్ చేయవద్దంటూ గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి.