Andhra Pradesh: సీఎం చంద్రబాబు ధర్నా నిర్వహించడం విడ్డూరం: ఈసీకి వైసీపీ లేఖ

  • ఈసీ నిర్ణయాలను బాబు వ్యతిరేకించడంపై విమర్శ
  • బాబు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు
  • ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడిందో   చెప్పాలి?

ఈసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ధర్నాకు దిగడాన్ని వైసీపీ నేత నాగిరెడ్డి తప్పుబట్టారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాశారు. చంద్రబాబు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆఖరి నిమిషంలో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేసిన నాగిరెడ్డి, ఎన్నికల ఫలితాలపై చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు తీరుపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ఓటర్ తన ఓటు హక్కును స్వేచ్ఛగా వేసేందుకు వీలు లేకుండా కుట్రలు పన్నుతున్నట్లు మీడియాకు ఇచ్చిన లీకుల ద్వారా తమకు సమాచారం అందిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని, ఓటర్ నిర్బయంగా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News