konda vishveshwar reddy: 2 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుస్తా: కొండా విశ్వేశ్వరరెడ్డి

  • చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి
  • టీఆర్ఎస్ రిగ్గింగ్ చేసినా... తనదే గెలుపు అంటూ ధీమా
  • టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొండా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ... లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని యత్నిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 2 లక్షల మెజార్టీతో గెలుపొందుతానని చెప్పారు. టీఆర్ఎస్ రిగ్గింగ్ చేసినా... తనకు గెలుపు ఖాయమని చెప్పారు. రెండో స్థానం కోసం టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడతాయని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి విశ్వేశ్వరరెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే.

konda vishveshwar reddy
chevella
congress
TRS
  • Loading...

More Telugu News