Narendra Modi: పాక్ ఏర్పాటుకు కాంగ్రెస్సే కారణం..ఆ పార్టీ మేనిఫెస్టో మాట్లాడేదీ పాక్ భాషలోనే: మోదీ

  • కశ్మీర్ విషయంలో పాక్ చెబుతున్నదే కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా చెబుతోంది
  • భారత గడ్డపై ఉగ్రవాదులకు చోటు లేదు
  • కొత్త ఓటర్లు తమ ఓటును బాలాకోట్ వీరులకు అంకితమివ్వాలి

మహారాష్ట్రలోని లాతూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. పాకిస్థాన్‌ ఏర్పడిందే కాంగ్రెస్ వల్లన్న మోదీ.. ఆ పార్టీ మేనిఫెస్టో కూడా పాక్ భాషనే మాట్లాడుతుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘పాకిస్థాన్ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌దే పూర్తి బాధ్యత. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ నేతలు తెలివిగా ఆలోచించారు. పాకిస్థాన్ ఏర్పాటు జరిగి ఉండాల్సింది కాదు’’ అని మోదీ పేర్కొన్నారు.

‘‘కశ్మీర్ సంబంధిత విషయాలపై కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో కూడా పాక్ భాషనే మాట్లాడుతోంది’’ అని ఆరోపించారు. పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని భారత వాయుసేన కూల్చిందని నిరూపించడానికి కాంగ్రెస్ నేతలకు ఎన్ని సాక్ష్యాలు కావాలని ప్రశ్నించారు. బీజేపీ సారథ్యంలో ‘కొత్త ఇండియా’ రూపుదిద్దుకుంటోందని, భారత గడ్డపై ఉగ్రవాదులకు చోటులేదని, వారిని ఏరిపారేస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును బాలకోట్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన వీరులకు అంకితమివ్వాలని ప్రధాని కోరారు.

  • Loading...

More Telugu News