Andhra Pradesh: కోస్తాలో నాలుగు రోజులపాటు వర్షాలు

  • ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
  • 11, 13 తేదీల్లో ఈదురు గాలులు ఉరుములతో కూడిన వర్షాలు
  • అప్రమత్తంగా ఉండాలని సూచన

కోస్తాంధ్రలో వచ్చే నాలుగు రోజుల్లో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొనగా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 11,13 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షంతోపాటు ఉరుములు కూడా పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. 

Andhra Pradesh
Coastal Andhra
Rains
Visakhapatnam District
Srikakulam District
  • Loading...

More Telugu News