Narendra Modi: మేం అందంగా కనిపించం కాబట్టే మీడియా మమ్మల్ని చూపించదు: కుమారస్వామి

  • మోదీ రోజూ మేకప్ వేసుకుని, వ్యాక్సింగ్ చేయించుకుంటారు
  • ప్రతిపక్ష నేతలు అందంగా ఉండరు కాబట్టే మీడియా పట్టించుకోవడం లేదు
  • కన్నడిగులకు మోదీ ఏం చేశారో చెప్పాలి

తాము అందంగా కనిపించకపోవడం వల్లే మీడియా తమను పట్టించుకోవడం లేదని, రోజూ ముఖానికి మేకప్ వేసుకునే మోదీ అందంగా కనిపిస్తారు కాబట్టి మీడియా ఆయననే ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ప్రతిపక్ష నాయకులు అందంగా ఉండడం లేదనే మీడియా వారిని చూపించడం లేదన్నారు. ప్రధాని మోదీ అయితే రోజూ ఉదయాన్నే మేకప్ వేసుకుంటారని, వ్యాక్సింగ్ కూడా చేయించుకుని అందంగా కనిపిస్తారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మోదీపై కుమారస్వామి విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం మానేసి మోదీ ముఖం చూసి ఓటెయ్యాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కన్నడిగులకు మోదీ ఏం చేశారో చెప్పాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. విమర్శలు చేసేవాళ్లను స్వేచ్ఛగా చేసుకోనివ్వాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య ఇకపైనా పొత్తు కొనసాగుతుందని కుమారస్వామి స్పష్టం చేశారు.

Narendra Modi
Kumaraswamy
Karnataka
BJP
Congress
JDS
  • Loading...

More Telugu News