YSRCP: బాణసంచా కాల్చిన వైసీపీ కార్యకర్తలు... నిప్పురవ్వలు అంటుకుని 29 పూరిళ్లు దగ్ధం!

  • నెల్లిమర్లలో ప్రచారం నిర్వహించిన బడుకొండ
  • పెద్ద ఎత్తున బాణసంచా కాల్చిన కార్యకర్తలు
  • రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా

 విజయనగరం జిల్లా డెంకాడ మండలం చల్లంగిపేట పంచాయతీ శివారులోని పోతయ్యపాలెం గ్రామంలో నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థి బడుకొండ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ ఘటనలో నిప్పురవ్వలు పక్కనే ఉన్న పూరిళ్లపై పడటంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. దీంతో 29 పూరిళ్లు దగ్ధమయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధితులు సర్వం కోల్పోయారు. ఇళ్లల్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.

YSRCP
Badukonda
Vijayanagaram
Nellimarla
Huts
  • Loading...

More Telugu News