Actor prakash raj: ఆటోకు అనుమతి లేదని.. నటుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు

  • నామినేషన్ కోసం వినియోగించిన ఆటోకు అనుమతి లేదన్న రిటర్నింగ్ అధికారి
  • పోలీసులకు ఫిర్యాదు
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కేసు నమోదైంది. నామినేషన్ వేసిన సమయంలో వినియోగించిన ఆటోకు ప్రకాశ్ రాజ్ అనుమతి తీసుకోలేదంటూ బెంగళూరులోని అశోక్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ మార్చి 22న ఆటోలో వెళ్లి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే, అనుమతి లేకుండా ఆటోలో రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందంటూ రిటర్నింగ్ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Actor prakash raj
bengaluru
Karnataka
Election
Case
  • Loading...

More Telugu News