Telugudesam: నేటితో అంతా గప్‌చుప్.. ఇక పార్టీలన్నీ పోల్‌మేనేజ్‌మెంట్‌పై దృష్టి

  • నేటి సాయంత్రం ఆరు గంటలతో ప్రచారానికి ముగింపు
  • నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తిన ప్రచారం
  • ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం బంద్

మరికొన్ని గంటల్లో ప్రచారానికి తెరపడనుంది. ఇన్నాళ్లూ చెవులు చిల్లులు పడేలా మోగిన మైకులు మూగబోనున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్డు షోలతో నిత్యం రద్దీగా కనిపించిన రహదార్లు బోసిపోనున్నాయి.  నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తిన ఎన్నికల పర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. నెల రోజులుగా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగిన నేతలు ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించనున్నారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126 ప్రకారం పోలింగ్‌కి 48 గంటల ముందు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుంది. అంటే 11న గురువారం పోలింగ్ జరగనుండడంతో నేటి సాయంత్రం ఆరు గంటలతో ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడనుంది. ఈ నెల 11న ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.

  • Loading...

More Telugu News