Hyderabad: నారాయణగూడ చౌరస్తాలో రూ.8 కోట్ల నగదు పట్టివేత
- ఇండియన్ బ్యాంక్ నుంచి డ్రా చేసినట్టు గుర్తింపు
- ఏడుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- భారీస్థాయిలో నగదు పట్టుబడడంపై అనుమానాలు
ఎన్నికల సమయంలో నగదు రవాణాపై అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రసీదుల్లేని నగదును పట్టుకున్న అధికారులు హైదరాబాదులో భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే నారాయణగూడ ఏరియాలో ఓ కారులో తరలిస్తున్న రూ.8 కోట్ల రూపాయలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో శంకర్, ప్రదీప్ రెడ్డి, నందిరాజు గోపి, బ్రహ్మం, ఇందుశేఖర్, చలపతిరాజు, సుకుమార్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ నగదును ఇండియన్ బ్యాంక్ నుంచి డ్రా చేసినట్టు గుర్తించారు.