visakhapatnam urbun: ముదపాకలో నాకు సెంటు భూమి ఉందని నిరూపించినా నీకే రాసిస్తా: పవన్ కల్యాణ్ కు బండారు సవాల్

  • జనసేనాని ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపాటు
  • తప్పని నిరూపిస్తే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
  • నీ గురించి నేను మాట్లాడితే తట్టుకోలేవని హెచ్చరిక

విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో తనకు సెంటు భూమి ఉందని నిరూపించినా ఆ మొత్తాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు రాసిచ్చేస్తానని, ఒక వేళ తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే నాకు క్షమాపణ చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? అని అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి సవాల్‌ విసిరారు.

ఆదివారం సాయంత్రం పెందుర్తిలో జరిగిన బహిరంగ సభలో జనసేనాని ఎమ్మెల్యే బండారు ఆక్రమణలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై బండారు ఘాటుగా స్పందించారు. ఎవరో పేపరుపై రాసిచ్చిన అంశాలను పట్టుకుని ఆయన విమర్శలు కురిపించారని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు. ‘ఇక మీ గురించి నేను మాట్లాడడం మొదలుపెడితే మీరు తట్టుకోలేరు. నీలా నేను దిగజారి మాట్లాడను. అందుకే ఆ విషయాలు ప్రస్తావించదల్చుకోలేదు’ అంటూ బండారు సుతిమెత్తగా హెచ్చరించారు.

visakhapatnam urbun
pendurthi
bandaru
Pawan Kalyan
land scam
  • Loading...

More Telugu News