EVM: వీవీప్యాట్ స్లిప్ ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

  • అసెంబ్లీకి ఐదు వీవీ ప్యాట్ లను లెక్కించాలని బెంచ్ ఆదేశం
  • పార్లమెంటుకి 35 వీవీ ప్యాట్ లను లెక్కించాలని తీర్పు 
  • పారదర్శకత కోసమేనన్న సుప్రీంకోర్టు

ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంచుకున్న ఒక ఈవీఎంకు అటాచ్ చేసిన వీవీప్యాట్ లలోని ఓట్ల ప్రింటవుట్లను లెక్కిస్తుండగా, ఇకపై ఐదు వీవీప్యాట్లలోని స్లిప్ లను లెక్కించి, సరిచూడాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే పార్లమెంటు నియోజక వర్గాల విషయానికి వస్తే, 35 ఈవీఎంల వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని తేల్చి చెప్పింది.

విపక్షాలతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని బెంచ్, ఈ మేరకు తీర్పిచ్చింది. కనీసం సగం వీవీ ప్యాట్ లను లెక్కించాలని విపక్షాలు వాదించగా, అలా చేస్తే, ఫలితాల వెల్లడికి ఐదు రోజుల సమయం వరకూ పడుతుందని ఈసీ, అందుకు సమ్మతమేనని విపక్షాలు నిన్న వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.

దేశంలోని 21 పార్టీలు వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంను ఆశ్రయించాయి. వాదనలు పూర్తయిన తరువాత అత్యున్నత ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. ఎన్నికల విధానంపై ప్రజలు, రాజకీయ పార్టీలకు మరింత విశ్వసనీయత కలగాల్సి వుందని, అందువల్ల ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాండమ్ గా ఎంపిక చేసిన వీవీ ప్యాట్ మెషీన్లను ఓపెన్ చేసి, వాటిల్లోని స్లిప్ లను సరిచూసిన తరువాతనే ఫలితాలను వెల్లడించాలని ఈ సందర్భంగా రంజన్ గొగొయ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News