India: హరిద్వార్ లో హాలీవుడ్ స్టార్.. ప్రత్యేక పూజలు నిర్వహించిన విల్ స్మిత్!

  • గంగానదికి హారతి కార్యక్రమంలో పాల్గొన్న నటుడు
  • తనను తాను తెలుసుకునేందుకు ఈ టూర్ ఉపయోగపడిందని వ్యాఖ్య
  • ఇన్ స్టా గ్రామ్ లో సందేశాన్ని పోస్ట్ చేసిన హాలీవుడ్ సూపర్ స్టార్

హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ భారత పర్యటనకు వచ్చారు. అనంతరం ఇక్కడి హరిద్వార్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి కార్యక్రమంలో విల్ స్మిత్ పాల్గొన్నారు. ఈ విషయమై విల్ స్మిత్ ఇన్ స్టా గ్రామ్ లో స్పందిస్తూ..‘భారత పర్యటన నాలో చైతన్యాన్ని నింపింది. ఈ పర్యటన ఓ అద్వితీయమైన అనుభవం.

విభిన్నవర్గాలు, ఇక్కడి ప్రకృతి అందాలు నాకో కొత్త అనుభూతి. నన్ను నేను తెలుసుకోవడానికి ఇదెంతో ఉపయోగపడింది’ అని పోస్ట్ చేశారు. తన హరిద్వార్ పర్యటన ఫొటోలను కూడా విల్ స్మిత్ పోస్ట్ చేశారు. కాగా, విల్ స్మిత్ ఇన్ స్టా గ్రామ్ పోస్టుకు ఏకంగా 15 లక్షలకు పైగా లైక్ లు రావడం గమనార్హం.


హిందూమతం అంటే విల్ స్మిత్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. 2017, డిసెంబర్ లో భారత పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అప్పటికే 90 శాతం భగవద్గీతను చదివేశానని తెలిపారు. తనపై అర్జునుడి ప్రభావం అధికంగా ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే రిషీకేశ్ ఆలయాన్ని సందర్శించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

India
hollywood
will smith
pooja
haridwar
  • Loading...

More Telugu News