Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో మరో 32 గంటల్లో ముగియనున్న ఎన్నికల ప్రచారం!

  • రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ప్రచారం
  • నేతలందరూ ప్రజల్లోనే
  • బిజీగా ఉన్న చంద్రబాబు, జగన్, కేసీఆర్

దాదాపు నెల రోజులకు పైగా సాగిన ఎన్నికల ప్రచార హోరు మరో 32 గంటల్లో ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్ కానున్నాయి. ఈ రెండు రోజులూ తెలుగు రాష్ట్రాల్లోని అందరు ప్రధాన నాయకులు, పోటీలో నిలబడిన అభ్యర్థులూ ప్రజల్లోకి వెళ్లి తమను గెలిపించాలని ప్రచారం చేయనున్నారు. నాయకులంతా రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, సభలతో బిజీబిజీగా ఉన్నారు.

కాగా, హైదరాబాద్ లో తొలుత భావించినట్టుగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ లేనట్టేనని తెలుస్తోంది. ఇక రాహుల్ పర్యటన కూడా రద్దయినట్టు సమాచారం. రేపు రాష్ట్రానికి అమిత్ షా వచ్చి రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పాటు విపక్ష నేత వైఎస్ జగన్ నేడు, రేపు పలు సభలు, రోడ్ షోలలో పాల్గొని తమ మలి దశ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. వీరితో పాటు టీడీపీ, వైసీపీల స్టార్ క్యాంపెయినర్లంతా పలు ప్రాంతాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

Andhra Pradesh
Telangana
Elections
Campaign
  • Loading...

More Telugu News