Telangana: కేసీఆర్ నోటికి అడ్డూఅదుపు లేదు.. ఆయన నోటికి జీఎస్టీ విధించాలి: రేణుకా చౌదరి

  • తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రేణుక ఫైర్
  • గ్రానైట్ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రమంత్రులను కోరానన్న రేణుక
  • వెటకారంగా మాట్లాడారని ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి మండిపడ్డారు. ఆయన నోటికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నోటికి అడ్డుకట్ట వేయాలంటే తొలుత ఆయన నోటికి జీఎస్టీ విధించాలని అన్నారు. ఇటీవల తాను కేంద్ర మంత్రులను కలిసింది గ్రానైట్‌ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించాలని కోరేందుకేనని రేణుకా చౌదరి తెలిపారు. తొలుత వారు వెటకారంగా మాట్లాడారని, అయితే, జీఎస్టీ ఎందుకు తగ్గించాలో వివరించి చెప్పడంతో గ్రానైట్‌ పరిశ్రమపై విధిస్తున్న జీఎస్టీని కేంద్రం తగ్గించిందని రేణుకా చౌదరి తెలిపారు.

Telangana
KCR
Congress
Khammam District
Renuka chowdary
  • Loading...

More Telugu News