Nagababu: నాగబాబును తిట్టి చిరంజీవిని పొగిడితే మాలాంటి వాళ్లకు నచ్చదు: నటుడు శివాజీ రాజాకు హైపర్ ఆది కౌంటర్

  • నరసాపురంలో నాగబాబును ఓడించాలని శివాజీరాజా పిలుపు
  • మండిపడిన హైపర్ ఆది
  • ఎవరి భిక్షంతో రెండేళ్లు ‘మా’ అధ్యక్షుడిగా చేశావని నిలదీత

నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబుకు ఓటెయ్య వద్దంటూ నటుడు శివాజీ రాజా ఇచ్చిన పిలుపునకు పవన్ వీరాభిమాని, జబర్దస్త్ ఫేం హైపర్ ఆది గట్టి కౌంటర్ ఇచ్చాడు. నాగబాబు పిల్లికి కూడా భిక్షం పెట్టడన్న శివాజీ రాజా ఆరోపణలపై హైపర్ ఆది మాట్లాడుతూ.. ఎవరి భిక్షంపై రెండేళ్లు ‘మా’ అధ్యక్షుడిగా పనిచేశారో చెప్పాలని ప్రశ్నించాడు. ఎవరి పని వాళ్లు చూసుకోవాలని, కుక్క పనిని గాడిద చేస్తానంటే కుదరదని పేర్కొన్నాడు.

శివాజీ రాజా అంటే తనకు గౌరవమేనన్న హైపర్ ఆది.. నాగబాబు గురించి ఆయన చెప్పినదాంట్లో ఒక్కటి కూడా నిజం లేదన్నాడు. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. చిరంజీవి అంటే తనకిష్టమన్న శివాజీ రాజా అదే నోటితో నాగబాబును తిట్టడం తమకు నచ్చదన్నాడు. పవన్ కల్యాణ్‌కు కూడా నచ్చదన్నాడు. నాగబాబు పిల్లికి భిక్షం పెట్టడని అనడం సరికాదని, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఒకరికి మూత్రపిండం పాడైతే ఆపరేషన్ కోసం పది లక్షల రూపాయలు ఇచ్చారని హైపర్ ఆది గుర్తు చేశాడు.

‘మా’ ఎన్నికల్లో ఓడిపోయాననే అక్కసుతోనే ఇలా మాట్లాడుతున్నట్టు అర్థమైందని, అది మంచిది కాదని హితవు పలికాడు. దమ్ముంటే నరసాపురం సెంటర్‌కు వచ్చి మాట్లాడాలని, ఎవరిని ఎవరు తరిమి కొడతారో తెలుస్తుందని హైపర్ ఆది సవాల్ విసిరాడు.

Nagababu
Pawan Kalyan
Chiranjeevi
sivaji raja
Hyper aadi
  • Loading...

More Telugu News