ABN-Andhrajyothy: ఆడియో టేపు వ్యవహారం.. ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై విజయసాయిరెడ్డి ఫిర్యాదు!

  • ఈ ఆడియో టేపు ఏబీఎన్ ఛానల్ లో నిన్న ప్రసారం 
  • జూబ్లీ హిల్స్ పోలీసులకు వైసీపీ ఐటీ వింగ్ ఫిర్యాదు
  • ఈ కుట్రలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణ

వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన పార్టీ నేతలతో మాట్లాడినట్టుగా చెబుతున్న ఆడియో లీకై కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోను ఏబీఎన్ ఛానల్ లో నిన్న ప్రసారం చేసింది. అయితే, ఆ ఆడియోలో మాటలు తనవి కాదని విజయసాయిరెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సహా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విజయసాయిరెడ్డి తరపున వైసీపీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్ చల్లా మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

విజయసాయిరెడ్డి వాయిస్ ని డబ్బింగ్ చేసి ఆయన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ఛానెల్ లో అసత్య కథనాలు ప్రసారం చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆ ఛానెల్ లో ప్రసారం చేసిన వీడియో, ఆడియో టేపులతో పాటు, ఈ సందర్భంగా నిర్వహించిన చర్చా కార్యక్రమాల వీడియోలను సాక్ష్యాలుగా అందజేశారు. ఈ కుట్ర వెనుక రాధాకృష్ణతో పాటు చంద్రబాబు కూడా ఉన్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. కాగా, ఈ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో దీన్ని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడికి బదిలీ చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News