megastar: అన్న బాటలో పవన్.. ‘జనసేన’ను టీడీపీకి ఎప్పుడో అమ్మేస్తారు: వైఎస్ షర్మిళ

  • నాడు పీఆర్పీని ‘కాంగ్రెస్’లో విలీనం చేశారు
  • ‘జనసేన’ను టీడీపీకి హోల్ సేల్ గా అమ్మేస్తారు
  • చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ మహిళా నేత షర్మిళ తీవ్ర ఆరోపణలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, తన అన్న చిరంజీవిని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు. నాడు పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం గుర్తుచేశారు.

జనసేన పార్టీని టీడీపీకి హోల్ సేల్ గా పవన్ ఎప్పుడో అమ్మేస్తారని సెటైర్లు విసిరారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో అవినీతి పాలన పోయి రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. టీడీపీ వాళ్లు ఓట్లు అడిగేందుకు వచ్చి, డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తారని ఆరోపించారు. ఆ డబ్బులు ఇచ్చేందుకు ఎవరైతే వస్తారో వారిని కూర్చోబెట్టి, బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చమని వారికి చెప్పాలని ప్రజలకు షర్మిళ సూచించారు.

megastar
Chiranjeevi
jana sena
Pawan Kalyan
prp
Telugudesam
YSRCP
Chandrababu
sharmila
  • Loading...

More Telugu News