India: భారత్ మళ్లీ దాడి చేస్తుందన్న సమాచారంతో పాకిస్థాన్ ఆందోళన

  • పక్కా సమాచారం ఉంది
  • ఏప్రిల్ 20వ తేదీ లోపు దాడి జరిగే అవకాశం
  • మీడియాకు వెల్లడించిన పాక్ విదేశాంగ మంత్రి

పుల్వామా ఉగ్రదాడికి బదులుగా భారత్ బాలాకోట్ పై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్ మరోసారి తమపై దాడి చేసేందుకు సిద్ధమవుతోందంటూ పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందిందని, ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ మధ్యలో ఎప్పుడైనా భారత్ దాడులు చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తెలిపారు.

భారత ప్రభుత్వం యుద్ధం కోసం తహతహలాడుతోందని ఆరోపించారు. నిఘా వర్గాలు చెబుతున్న దాన్నిబట్టి ప్రస్తుతం భారత్ మరో దాడికి ప్రణాళిక రచిస్తోందన్నది సుస్పష్టం అన్నారు. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనుమతితోనే తాము ఈ వివరాలు వెల్లడిస్తున్నామని చెప్పిన ఖురేషి, అందుకు సంబంధించిన ఆధారాలు వెల్లడించడానికి మాత్రం ససేమిరా అన్నారు.

  • Loading...

More Telugu News