Chandrababu: సుబ్రహ్మణ్యం కమిటీకి డబ్బులు ఇవ్వకుండా రాజశేఖర్ రెడ్డి మోసం చేస్తే, కాపుల కోటా విషయం జగన్ తన పరిధిలో లేదన్నాడు: చంద్రబాబు

  • కాపులకు న్యాయం చేసింది మేమే
  • బీసీ కోటాలో కాపుల రిజర్వేషన్లు సాధించాం
  • కాపులు మాకు కాపు కాయాలి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. సాధారణంగా పగటివేళల్లో బహిరంగ సభల్లో పాల్గొనే చంద్రబాబునాయుడు ఈసారి మధ్యాహ్నం వేళ రోడ్ షో నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఎక్కువ ప్రాబల్యం ఉన్న కాపులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో పిఠాపురం, నరసాపురం ప్రాంతాల్లో కాపుల పరిస్థితి చూసి బాధపడ్డానని, కాపులను బీసీల్లో చేర్చాలని ఆనాడే నిర్ణయించుకున్నానని, చెప్పింది చేశానని అన్నారు. అంతేగాకుండా, రూ.1000 కోట్లను కాపుల కోసం బడ్జెట్ లో కేటాయించింది కూడా టీడీపీనే అని స్పష్టం చేశారు.

బీసీలపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన సుబ్రహ్మణ్యం కమిటీకి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని, ఆ తర్వాత కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినా పట్టుబట్టి కాపులకు బీసీ కోటాలో రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఇదొక చరిత్రాత్మక అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కాపులు తనకు కాపు కాయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కాపుల కోటా గురించి అప్పట్లో జగన్ తన పరిధిలో విషయం కాదన్నాడని, ఇప్పుడు కాపుల ఓట్లు మాత్రం జగన్ పరిధిలో ఉన్నాయా? అని విమర్శించారు.

  • Loading...

More Telugu News