Bollywood: మెగాస్టార్ తో ఫొటో దిగిన ఆమిర్ ఖాన్.. చిరంజీవిపై ప్రశంసలు కురిపించిన నటుడు!

  • కుటుంబంతో కలిసి చిరంజీవి జపాన్ పర్యటన
  • క్యోటో ఎయిర్ పోర్టులో ఎదురుపడ్డ ఆమిర్ ఖాన్
  • చిరుతో ఫొటో దిగిన బాలీవుడ్ నటుడు

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి క్యోటో ఎయిర్ పోర్టులో ఆమిర్ ఖాన్ కంట పడ్డారు. అంతే చిరంజీవితో ఫొటో దిగిన ఆమిర్ ఖాన్ ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా స్పందిస్తూ..‘నా అభిమాన నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ చిరంజీవి గారు క్యోటో ఎయిర్ పోర్టులో కనిపించగానే పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆయన్ను కలవడం నిజంగా ఆనందంగా ఉంది.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రాజెక్టుపై ఆయనతో మాట్లాడాను. మీరు ఎప్పుడూ మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు సార్’ అని ఆమిర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ నుంచి విరామం తీసుకున్న చిరు, జపాన్ పర్యటనకు వెళ్లారు. ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

Bollywood
Tollywood
amir khan
Chiranjeevi
Japan
Twitter
  • Loading...

More Telugu News