Actor Shivaji: కేసీఆర్‌తో జగన్ స్నేహం ఎందుకో అర్థం కావడం లేదు.. అది పులి మీద స్వారీ: సినీ నటుడు శివాజీ

  • నా పోరాటం ఏపీ ప్రజల కోసమే
  • సరైన నాయకుడిని ఎన్నుకుని భావితరాలకు అద్భుతమైన ఆస్తిని అందించడండి
  • ‘ది ట్రూత్’ వీడియోలో శివాజీ వేడుకోలు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతీక్షణం ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్ ఎందుకు స్నేహం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని సినీ నటుడు శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ది ట్రూత్’ పేరుతో విలేకరులకు చూపిస్తున్న వీడియోలో కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ.. కేసీఆర్‌తో జగన్ స్నేహం పులి మీద స్వారీ లాంటిదేనన్నారు.

జగన్‌తో తనకు వ్యక్తిగత వైరం లేదన్న శివాజీ.. తన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమేనన్నారు. పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయో ఈ వీడియో ద్వారా చూపించానని, విజ్ఞత గల ప్రజలు ఈ ఎన్నికల్లో సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా భావితరాలకు పోలవరం వంటి అద్భుతమైన ఆస్తిని అందించాలని కోరారు.

Actor Shivaji
Telugudesam
Polavaram
Jagan
Chandrababu
KCR
Telangana
  • Loading...

More Telugu News