Actor shivaji: పక్క రాష్ట్రంలోని కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శివాజీ

  • కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారు
  • ఈ మహాయజ్ఞంలో నీళ్లు పోసేందుకు ప్రయత్నిస్తారు
  • రాష్ట్రప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి

విలేకరుల సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల వీడియోను చూపిస్తున్న శివాజీ అందులో మాట్లాడుతూ.. పోలవరం ఓ ఇంజినీరింగ్ అద్భుతమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకుంటే కేసీఆర్ దీనిని ఆపివేయడం ఖాయమన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని, కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపి తీరుతారని స్పష్టం చేశారు. తనకు అనుకూలంగా వచ్చే వారి కోసం కేసీఆర్ ఎంతైనా ఖర్చు చేస్తారని, ఈ మహాయజ్ఞంలో కేసీఆర్ నీళ్లు పోస్తారని సంచలన ఆరోపణలు చేశారు.

పక్కరాష్ట్రంలోని కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారని వారి ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. వారి కుట్రలను బద్దలుగొట్టకపోతే మీ కుటుంబాలకు అన్యాయం చేసుకున్నవారు అవుతారని శివాజీ హెచ్చరించారు. రాబోయే తరాలకు అన్యాయం చేసిన వారు అవుతారని అన్నారు. ఆ దారుణాన్ని ఆపాలని, సరైన నేతను ఎంచుకోవాలని శివాజీ పిలుపునిచ్చారు.

Actor shivaji
Polavaram project
Andhra Pradesh
Chandrababu
KCR
Jagan
  • Error fetching data: Network response was not ok

More Telugu News