Yogi Adityanath: నేడు ఏపీ, తెలంగాణలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుడిగాలి పర్యటన

  • అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యోగి  ప్రచారం
  • తెలంగాణలోని పెద్దపల్లిలో బహిరంగ సభ
  • యోగి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

ఏపీలో ఈసారి గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా సహా కేంద్రమంత్రులు ఇది వరకే ఓసారి ఏపీలో ప్రచారం చేసి వెళ్లారు. తాజాగా, నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏపీకి రానున్నారు. చిత్తూరులో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఆయన రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.  

ఏపీలో అడుగుపెట్టడానికి ముందు తెలంగాణలోని పెద్దపల్లి పట్టణంలోని జూనియర్ కాలేజీలో బీజేపీ బహిరంగ సభలో ఆదిత్యనాథ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత జహీరాబాద్‌లోని యల్లారెడ్డిలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలలో జరిగే ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొంటారు.

Yogi Adityanath
Uttar Pradesh
BJP
Chittoor District
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News