: ముంబైలోని టాడా కోర్టులో సంజయ్ దత్ లొంగుబాటు


పుణె ఎరవాడ జైలులో లొంగిపోవడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో నటుడు సంజయ్ దత్ దాఖలు చేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్నాడు. ముంబైలోని టాడా కోర్టులో లొంగిపోతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. మతవాద శక్తుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, కనుక పుణెలోని ఎరవాడ జైలులో లొంగిపోవడానికి అనుమతివ్వాలని సంజయ్ నిన్ననే కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో నేటితో గడువు ముగిసిపోతున్నందున సంజయ్ దత్ రేపు టాడా కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమయ్యాడు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగున్నందుకు సంజయ్ దత్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది. లోగడ 18 నెలల జైలు శిక్షను ఆయన అనుభవించారు. మిగిలి ఉన్న మూడున్నర సంవత్సరాల శిక్షను ఏ జైలులో గడిపేదీ లొంగుబాటు అనంతరం టాడా కోర్టు నిర్ణయిస్తుంది.

  • Loading...

More Telugu News