Niveda Thomas: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రజనీకాంత్ కి కూతురిగా అందాలతార 
  • లారెన్స్ దర్శకత్వంలో హిందీలో 'కాంచన'
  • బ్రహ్మానందం ప్రధాన పాత్రలో చిత్రం 
  • 'బంగారుబుల్లోడు'గా అల్లరి నరేశ్

*  యువ కథానాయిక నివేద థామస్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూతురుగా నటించనుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించే చిత్రంలో కూతురి పాత్ర చాలా కీలకమట. ఆ పాత్రకు తాజాగా నివేదాను ఎంచుకున్నట్టు సమాచారం.
*  తెలుగులో వచ్చిన హిట్ చిత్రం 'కాంచన'ను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, కైరా అద్వానీ జంటగా నటించే ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహించడానికి అంగీకరించాడు.
*  ఇటీవల గుండెకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చాలా కాలం రెస్ట్ తీసుకున్నారు. తిరిగి ఇప్పుడు మళ్లీ కెమేరా ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించే 'బ్రహ్మి ఈజ్ బ్యాక్' చిత్రంలో ఆయన లీడ్ రోల్ పోషిస్తారట.  
*  గత కొంతకాలంగా కెరీర్ పరంగా వెనుకపడిన హాస్య కథానాయకుడు అల్లరి నరేశ్ ఇప్పుడు 'మహర్షి' చిత్రంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరోపక్క, అనిల్ సుంకర నిర్మించే చిత్రంలో సోలో హీరోగా నటిస్తున్నాడు. దీనికి 'బంగారుబుల్లోడు' అనే టైటిల్ని ఖరారు చేశారు.

Niveda Thomas
Rajanikanth
Kaira
Brahmanandam
  • Loading...

More Telugu News