Lok Sabha Elections: పట్టువదలని విక్రమార్కుడు.. 30 సార్లు పరాజితుడు.. అయినా మళ్లీ పోటీ!

  • 31వ సారి బరిలోకి దిగుతున్న శ్యాంబాబు
  • పీవీ నరసింహారావు, బిజూ పట్నాయక్‌పైనా పోటీ
  • ఈసారి తప్పక గెలుస్తానని ధీమా

ఒడిశాకు చెందిన శ్యాంబాబు సుబుధి 1962లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఏ ఎన్నికలు వచ్చినా బరిలో నిలుస్తూనే ఉన్నారు.. ఓడిపోతూనే ఉన్నారు. ఎన్నో పార్టీలు ఆయనకు టికెట్ ఆఫర్ చేసినా, శ్యాంబాబు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగారు. పోటీ చేసిన ప్రతిసారీ ఓడిపోవడం ఆయనకు అలవాటుగా మారింది. ఇప్పటికి 30సార్లు ఆయన ఓటమి పాలయ్యారు.

అయినప్పటికీ ఏమాత్రం వెరవని ఆయన ఈసారి కూడా మళ్లీ బరిలోకి దిగారు. ఏదో ఒకరోజు ప్రజలు తనను గెలిపిస్తారని ఆయన నమ్ముతున్నారు. అదెప్పుడో కాదని, ఈసారే గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆస్కా, బెర్హంపూర్ (బరంపురం) లోక్‌సభ స్థానాల నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. విశేషం ఏమిటంటే.. దిగ్గజాలు అయిన పీవీ నరసింహారావు, బిజు పట్నాయక్‌ల మీద కూడా ఆయన పోటీ చేయడం. ప్రస్తుతం ఎన్నికలు బాగా మారిపోయాయని, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Lok Sabha Elections
Odisha
Berhampur
PV Narasimharao
Biju patnaik
  • Error fetching data: Network response was not ok

More Telugu News