BJP: బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన శత్రుఘ్న సిన్హా

  • హస్తం పార్టీలోకి శత్రుఘ్న సిన్హా
  • బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం రోజే పార్టీకి వీడ్కోలు
  • పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నశించిందంటూ ఆగ్రహం

బాలీవుడ్ లో షాట్ గన్ సిన్హాగా పేరుగాంచిన సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా (72) బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆయన పార్టీని వీడారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా సమక్షంలో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శత్రుఘ్న సిన్హా గత ఎన్నికల్లో బీహార్ లోని పాట్నా సాహిబ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.

అయితే, ప్రస్తుతం బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం నశించిందని, అధినాయకత్వం చూస్తే వన్ మ్యాన్ షో, పార్టీ చూస్తే టు మెన్ షో అని పరోక్షంగా మోదీ, అమిత్ షాలను విమర్శించారు. గత పదేళ్లుగా పాట్నా సాహిబ్ నియోజకవర్గంలో శత్రుఘ్న సిన్హా పట్టు సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం ఆయనకు బదులు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను ఎంపీ అభ్యర్థిగా బరిలో దించింది. దాంతో, సిన్హా బీజేపీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్ లో చేరారు.

  • Loading...

More Telugu News