Virat Kohli: బెంగళూరు పరాజయాల బాట.. కోహ్లీ రికార్డుల వేట

  • టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన కోహ్లీ
  • సురేశ్ రైనా రికార్డు బద్దలు
  • 243 ఇన్నింగ్స్‌లలోనే ఘనత

ఐపీఎల్‌లో బెంగళూరు పరాజయాల బాట పడుతున్నప్పటికీ ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తున్నాడు. ఐపీఎల్‌లో ఇటీవలే ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ.. గత రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 84 పరుగులు చేసిన కోహ్లీ టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 243వ ఇన్సింగ్స్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించి సురేశ్ రైనాను వెనక్కి నెట్టేశాడు. రైనా 284 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు సాధించగా, కోహ్లీ 243 ఇన్నింగ్స్‌లలోనే ఈ రికార్డు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో కోహ్లీ 35 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.

 బెంగళూరులో గత రాత్రి కోల్‌కతా రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సేన మరోమారు ఓటమి పాలైంది. 205 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ కోల్‌కతా ఆటగాడు ఆండ్రూ రసెల్ దెబ్బకు బెంగళూరు కకావికలమైంది. 13 బంతుల్లో ఫోర్, ఏడు సిక్సర్లతో 48 పరుగులు చేసిన రసెల్ బెంగళూరు చేతుల్లోకి వెళ్లిన విజయాన్ని అమాంతం లాగేసుకున్నాడు.

Virat Kohli
Suresh raina
RCB
fastest Indian
Bengaluru
Kolkata
  • Loading...

More Telugu News