UPSC: గర్ల్ ఫ్రెండ్ వల్లే విజయం: సివిల్స్ టాపర్ కనిష్క్

  • యూపీఎస్సీ పరీక్షల్లో తొలిస్థానం
  • ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యం
  • మీడియాతో కనిష్క్ కటారియా

నిన్న ప్రకటించిన యూపీఎస్సీ పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచిన కనిష్క్ కటారియా, తాను విజయం సాధించానంటే, దానికి తన స్నేహితురాలు కారణమని ప్రకటించారు. ఐఐటీ బాంబేలో చదువుకున్న రాజస్థాన్ యువకుడు కనిష్క్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అసలు అనుకోలేదని, తన గార్ల్ ఫ్రెండ్ ప్రోత్సాహంతో పాటు తల్లిదండ్రులు, సోదరి సహకారంతో పరీక్షల్లో విజయం సాధించానని అన్నారు. ప్రజా పాలకుడిగా సేవచేయాలన్నది తన లక్ష్యమని అన్నారు. గణితాన్ని ఆప్షనల్ గా తీసుకున్న కనిష్క్, కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశారు.

UPSC
IAS
Kanishk
Topper
  • Loading...

More Telugu News