KL Rahul: కేఎల్ రాహుల్ అలాంటి వ్యక్తి కాదు: ప్రీతి జింతా

  • గతంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు
  • సస్పెన్షన్ ను ఎదుర్కొన్న పంజాబ్ టీమ్ ఆటగాడు
  • మద్దతుగా నిలిచిన జట్టు యజమాని ప్రీతి జింతా

ఆమధ్య 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఈ షో తరువాత రాహుల్ సస్పెన్షన్ ను కూడా ఎదుర్కొని జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజా ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ జట్టుతో రాహుల్ ఉండగా, ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింతా ఆయనకు మద్దతుగా నిలిచింది.

మహిళల విషయంలో రాహుల్ చాలా మర్యాదస్తుడని చెప్పింది. అతను చాలా మంచి వాడని, ఆ షోలో అలా ఎందుకు అన్నాడో తెలియదని వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని, రాహుల్ తిరిగి ఫామ్ ను అందుకుని మైదానంలో రాణిస్తుండటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని ప్రీతి తెలిపింది.

KL Rahul
Preeti zinta
IPL
Punjab
  • Loading...

More Telugu News