Pawan Kalyan: ఆసుపత్రి నుంచి పవన్ డిశ్చార్జ్.. వైద్యుల సూచనతో నేటి పర్యటన రద్దు

  • విజయనగరం పర్యటనలో వడదెబ్బకు గురైన పవన్ 
  • విజయవాడలో చికిత్స అనంతరం డిశ్చార్జ్
  • వైద్యుల సూచనతో నేడు విశ్రాంతి

వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం విజయనగరంలో పర్యటించిన పవన్ అనంతరం హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే బాగా నీరసంగా ఉన్న పవన్‌కు విమానాశ్రయంలోని రమేశ్‌ హాస్పిటల్‌ టెలిమెడిసిన్‌ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స చేశారు. మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వెళ్లి ఆయుష్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో జరగాల్సిన పర్యటనలను జనసేనాని రద్దు చేసుకున్నారు.  

ఐసీయూలో చికిత్స అనంతరం వైద్యులు పవన్‌ను డిశ్చార్జ్ చేశారు. ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు పవన్ నేటి పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, పవన్ డిశ్చార్జ్ విషయం తెలుసుకున్న అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

Pawan Kalyan
Vizianagaram
Vijayawada
sunstroke
Hospital
  • Loading...

More Telugu News