Telangana: కేసీఆర్ పాలనలో ప్రతిపక్షాల అవసరమే లేకుండా పోయింది!: ఎర్రబెల్లి దయాకర్ రావు

  • తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది
  • కొడకండ్లను అన్ని విధాలా అభివృద్ధి చేస్తా
  • యువతకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తా

కేసీఆర్ పాలనలో ప్రతిపక్షాల అవసరం లేకుండా పోయిందని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలోని కొడకండ్లలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. కొడకండ్లను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, యువతకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తనదని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Telangana
TRS
Errabelli
dayakar
janagaon
  • Loading...

More Telugu News