Rashma: కేటీఆర్ రోడ్డు షోకు వెళుతూ.. తల్లి సహా ఏడాది కూతురు మృతి

  • కూతురితో కలిసి రోడ్‌షోకు వెళుతున్న రేష్మ
  • లాలాపేట వద్ద ఢీకొట్టిన రైలు
  • రేష్మ కుటుంబంలో విషాదం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నేడు ఆయన లాలాపేటలో రోడ్‌ షో నిర్వహించారు. దీనికి హాజరయ్యేందుకు వెళుతూ తల్లీకూతుళ్లు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నాచారానికి చెందిన కొందరు మహిళలతో కలిసి కేటీఆర్ రోడ్‌షోకు రేష్మ(18) తన ఏడాది పాప అమెరీన్‌తో కలిసి వెళుతుండగా లాలాపేట వద్ద రైలు ఢీకొట్టింది. దీంతో తల్లీకూతుళ్లు మృతి చెందారు.

Rashma
KTR
Road Show
Amerin
Lalapeta
  • Loading...

More Telugu News