chandrababu: మైనార్టీలకు మరో హామీ ప్రకటించిన చంద్రబాబు
- మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తా
- ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు సమకూర్చుతాం
- పేద కుటుంబాలకు ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం వచ్చేలా చేస్తా
టీడీపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, కోటి మంది డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇంటర్ విద్యార్థులందరికీ ల్యాప్ టాప్ లు ఇస్తామని.. దీని వల్ల పుస్తకాలు మోసే బాధ తప్పుతుందని చెప్పారు.
ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ. 2 లక్షల కనీస ఆదాయం వచ్చేలా చేస్తానని చెప్పారు. కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తానని తెలిపారు. వైసీపీ అధినేత జగన్ జుట్టు ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చేతిలో ఉందని... వాళ్లు ఏం చెబితే జగన్ అది చేస్తారని అన్నారు. జగన్ ఏపీ ద్రోహి అంటూ విమర్శించారు.