Guntur District: చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు: యరపతినేని

  • వైసీపీని, జగన్ మాటలను ప్రజలు నమ్మట్లేదు
  • ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం
  • చంద్రబాబు పథకాలే మాకు శ్రీరామరక్ష 

ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం అని  ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ అన్నారు. గురజాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రచారాన్ని, జగన్ మాటలను ప్రజలు నమ్మడం లేదని, చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని అన్నారు. చంద్రబాబు పథకాలతో రాష్ట్రంలో అందరూ లబ్ధి పొందినట్టు చెప్పారు. ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని, ‘చంద్రన్నకే ఓటేస్తాం, తెలుగుదేశం పార్టీకే ఓటేస్తాం’ అని చెబుతున్నారని అన్నారు.

Guntur District
Gurajala
Telugudesam
yarapatineni
  • Loading...

More Telugu News