Nizamabad District: నిజామాబాద్ లో పోలింగ్ వాయిదా వేయాలని రైతు అభ్యర్థులు కోరారు: రజత్ కుమార్

  • ఈసీ కేటాయించిన గుర్తులపై అవగాహన లేదన్నారు
  • ప్రచారానికి మరింత సమయం కావాలని కోరారు
  • నమూనా పోలింగ్ నిర్వహించాం

నిజామాబాద్ లో పోలింగ్ వాయిదా వేయాలని లోక్ సభకు పోటీ చేస్తున్న రైతు అభ్యర్థులు కోరారని సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈసీ కేటాయించిన గుర్తులపై అవగాహన లేదని, ప్రచారానికి మరింత సమయం కావాలని ఆ అభ్యర్థులు కోరినట్టు చెప్పారు. రైతు అభ్యర్థుల విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని అన్నారు. ఇదిలా ఉంచితే, ఈ నెల 11న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, నిజామాబాద్ లో నమూనా పోలింగ్ నిర్వహించినట్టు వివరించారు.

Nizamabad District
ceo
rajathkumar
  • Loading...

More Telugu News