Pawan Kalyan: పవన్ ‘బాహుబలి’ కన్నా పెద్ద ప్యాకేజ్ తీసుకున్నారు: హీరో రాజశేఖర్ ఆరోపణలు

  • ప్రజల కోసం పవన్ సినిమాలు వదిలేసి వచ్చారట
  • పవన్ మనల్ని ఏమార్చి సీఎం అయిపోతారట
  • ప్రజల జీవితంతో ఎందుకు ఆటలు?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన తప్పులేదని, ఆ ఆలోచన ఎవరికైనా ఉండొచ్చని, తనకు కూడా ఉందంటూ వైసీపీ నాయకుడు, ప్రముఖ హీరో రాజశేఖర్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సినిమా రంగంలో ఓ కాలు, రాజకీయ రంగంలో మరో కాలు పెట్టిన పవన్, పూర్తిగా సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి రావాలని సూచించారు.

అంతే తప్ప, నాలుగేళ్లు సినిమాలు చేసుకుని, ఐదో ఏడాదిలో వచ్చి ‘నేను దేశం కోసమే బతుకుతున్నా, దేశం కోసమే అన్నీ చేస్తానని చెప్పి, మనల్ని ఏమార్చి ముఖ్యమంత్రి అయిపోతారట’ అంటూ దెప్పిపొడిచారు. ప్రజల జీవితాలతో ఎందుకు ఈ ఆటలు? అని ప్రశ్నించారు. జనసేన పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దని, వైసీపీకి ఓటు వేసి ప్రజలు తమ భవిష్యత్ ను బంగారం చేసుకోవాలని రాజశేఖర్ అన్నారు. సినిమాల్లో నటిస్తే తనకు వచ్చే కోట్లకు కోట్ల డబ్బు వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, త్యాగం చేసి వచ్చానని పవన్ చెబుతున్నారని, ఇదంతా అబద్ధమని, ‘బాహుబలి’ కన్నా పెద్ద ప్యాకేజ్ ను ఆయన తీసుకుని వచ్చారని ఆరోపించారు.

Pawan Kalyan
janasena
YSRCP
rajasheker
  • Loading...

More Telugu News