Chandrababu: మూడు సార్లు కాదు, ఇకపై ప్రతి సంవత్సరం పసుపు-కుంకుమ ఇస్తా: చంద్రబాబు హామీ

  • కోటిమంది చెల్లెమ్మలు ఉన్న ఏకైక అన్నయ్యను నేనే
  • డ్వాక్రా మహిళలపై హామీల వర్షం
  • ఆలూరు సభలో చంద్రబాబు హామీ

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ముంగిట డ్వాక్రా మహిళలపై హామీల వర్షం కురిపించారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కోటి మంది చెల్లెమ్మలు ఉన్న ఏకైక అన్నయ్య ఈ ప్రపంచంలో తాను తప్ప మరొకరులేరని ఉప్పొంగిపోయారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలపై ఎల్లలులేని అనురాగం ప్రదర్శించారు. కొన్నిరోజుల క్రితం తాను పసుపు-కుంకుమ మూడు సార్లు ఇస్తానని చెప్పానని, ఇప్పుడు ఆలూరు సాక్షిగా మూడు సార్లు కాదు, ప్రతి ఏడాది పసుపు-కుంకుమ ఇస్తానంటూ హామీ ఇచ్చారు.

కొన్నిరోజుల క్రితం చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ, ఐదేళ్ల వ్యవధిలో మూడు పర్యాయాలు పసుపు-కుంకుమ పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడా ప్రకటనను సవరిస్తూ, ఏడాదికోసారి ఇస్తామంటూ సభాముఖంగా చెప్పారు. తుది విడత చెక్కులు కూడా బ్యాంకులో వేశామని, వెళ్లి నగదు తెచ్చుకోవాలని సూచించారు. చెల్లెమ్మలు ఇంటింటికీ తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యతను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News