sumitra mahajan: బీజేపీ అధిష్ఠానాన్ని నిలదీస్తూ... కీలక ప్రకటన చేసిన సుమిత్రా మహాజన్

  • లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన
  • ఇండోర్ కు ఇంతవరకు అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్న
  • ఇప్పటి వరకు 8 సార్లు లోక్ సభకు ఎన్నికైన సుమిత్రా

లోక్ సభ స్పీకర్, బీజేపీ సీనియర్ నాయకురాలు సుమిత్రా మహాజన్ కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇదే సమయంలో.. ఇండోర్ నుంచి అభ్యర్థిని ఇంకా ఎందుకు ప్రకటించలేదని పార్టీ అధిష్ఠానాన్ని ఆమె నిలదీశారు. వెంటనే అభ్యర్థిని ప్రకటించాలని కోరారు. 75 ఏళ్ల సుమిత్రా మహాజన్ ఇప్పటి వరకు 8 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వయసు పైబడిన నేతలను పోటీకి దూరంగా ఉంచాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే పార్టీ కీలక నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్లకు సైతం టికెట్ ఇవ్వలేదు. ఇదే విధంగా సుమిత్రకు కూడా టికెట్ ఇవ్వకపోవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. ఇదే సమయంలో పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ... ఇండోర్ కు ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు.

sumitra mahajan
indore
mp
lok sabha
elections
bjp
  • Loading...

More Telugu News