Telangana: టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికెళ్లిన కేసీఆర్.. టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానం!

  • హైదరాబాద్ లోని మండవ ఇంటిలో ఈరోజు భేటీ
  • టీఆర్ఎస్ కు, తెలంగాణకు అనుభవజ్ఞుల అవసరముందని వ్యాఖ్య
  • ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన మండవ

తెలంగాణ టీడీపీ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి ఈరోజు అనుకోని అతిథి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లో చేరాలని ఆయన్ను కేసీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్రానికి మీలాంటి అనుభవజ్ఞుల అవసరం ఉందన్నారు. దీంతో కేసీఆర్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మండవ వెంకటేశ్వరరావు.. ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా, రేపు లేదా ఎల్లుండి మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశముందని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

నిజామాబాద్ జిల్లాలో టీడీపీకి మండవ వెంకటేశ్వరరావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana
Telugudesam
mandava
venkateswarlu
TRS
KCR
home visit
  • Loading...

More Telugu News