Telugudesam: 8న ఆంధ్రప్రదేశ్‌ కి మాజీ ప్రధాని దేవగౌడ.. టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం

  • కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు సభలకు హాజరు
  • బెంగళూరు నుంచి నేరుగా విజయవాడకు
  • అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తణుకు సభకు

జేడీఎస్‌ చీఫ్‌, మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవగౌడ ఈనెల 8వ తేదీన ఏపీలో పర్యటించనున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ఆ రోజు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇందుకోసం ఆయన బెంగళూరు నుంచి విమానంలో నేరుగా విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా తణుకు సభకు హాజరవుతారు. అక్కడ జరిగే సభలో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు. అనంతరం అదే జిల్లాలోని ఉంగుటూరు, కృష్ణా జిల్లాలోని తిరువూరు, పామర్రు, పెడన సభల్లో పాల్గొంటారు. రాత్రి ఎనిమిది గంటలకు తిరిగి విజయవాడ చేరుకుని విమానంలో బెంగళూరు వెళ్తారు.

Telugudesam
HD devagouda
West Godavari District
Krishna District
election campaign
  • Loading...

More Telugu News