Postal Ballet: పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మొదలు... ఓటుకు రూ. 5 వేల వరకూ ఆఫర్!

  • పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బందికి బ్యాలెట్ ఓట్లు
  • బ్యాలెట్ పేపర్ పై ఓటు కోసం అభ్యర్థుల ప్రలోభాలు
  • అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు

ఈ నెల 11న జరిగే పోలింగ్ కోసం విధుల నిర్వహణలో ఉండే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఈ ఉదయం ప్రారంభం కాగా, ఎక్కడికక్కడ ప్రలోభాల పర్వం తారస్థాయికి చేరింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ఎలాగైనా విజయం సాధించాలన్న కృతనిశ్చయంతో ఉన్న రాజకీయ పార్టీల నేతలు, ఒక్కో పోస్టల్ బ్యాలెట్ ఓటుకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకూ ఆఫర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ తీసుకోగానే, దానిపై తమ ఓటు పడేలా చూడాలని భావిస్తున్న పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల ముందే కనిపిస్తున్నారు. బహిరంగంగా ఓట్ల కొనుగోలు జరుగుతున్నా, అక్కడే ఉన్న ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

Postal Ballet
Vote
Employees
Elections
  • Loading...

More Telugu News