Vijay Sai Reddy: నందమూరి సుహాసిని పరిస్థితే బాలకృష్ణ అల్లుడు భరత్ కు కూడా: విజయసాయి రెడ్డి

  • బంధువులను బలిపశువులను చేయడంలో ముందున్న బాబు
  • భరత్ కు టిక్కెట్టిచ్చి జనసేన అభ్యర్థిని గెలిపించాలంటున్నారు
  • ట్విట్టర్ లో ఆరోపించిన విజయసాయిరెడ్డి

తన బంధువులను బలి పశువులను చేయడంలో చంద్రబాబు ముందుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు. కూకట్ పల్లిలో నందమూరి సుహాసినిని బలవంతంగా పోటీకి దింపి ఓడగొట్టించినట్టే, బాలకృష్ణ అల్లుడు భరత్ ను విశాఖ నుంచి పోటీలో ఉంచి, జనసేన అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "సొంత బంధువులను బలిపశువులు చేయడంలో చంద్రబాబును మించిన వారెవరుండరు. కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసినిని పోటీ చేయించి ఓడగొట్టారు. లోకేశ్ తోడల్లుడు భరత్‌కు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చి జనసేన జేడీని గెలిపించాలని క్యాడర్‌ను ఆదేశించారు. లోకేశ్‌కు పోటీ కాకూడదనే ఈ స్కెచ్" అని అన్నారు.



Vijay Sai Reddy
Bharat
Suhasini
Chandrababu
Twitter
  • Loading...

More Telugu News